కర్నాటక మంత్రికి కరోనా

కర్నాటకలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఏమాత్రం కేసులు సంఖ్య ఏమాత్రం తగ్గటంలేదు. సామాన్యులతో పాటు.. రాజీకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. కర్నాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్, ఆయన భార్య, అల్లుడికి కరోనా సోకిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మంత్రి తన భార్యతో కలిసి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్ రావడంతో తన భార్య, తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు కర్ణాటక వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్ శనివారం చెప్పారు.

Recommended For You