9566 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పోలీస్‌శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే ఇప్పటి వరకు 9,566 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో 988 అధికారులు, 8578 పోలీసు సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా వైరస్ కార‌ణంగా పోలీసు విభాగానికి చెందిన 103 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 9 మంది ఉన్నతాధికారులు, 94 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో 1929 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 7534 మంది పోలీసులు కోలుకున్నారు.

Recommended For You