దిల్ రాజు ముగ్గురు పిల్లలను..

తెలుగు చిత్ర రంగ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు అనాథలైన ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించాడు. అనంతరం అతని భార్య ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె కూడా అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతి చెందింది. తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు చిన్నారులు అనాధలయ్యారు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఆత్మకూరు గ్రామ సర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలని మంత్రి నిర్మాత దిల్ రాజును కోరారు. స్వయంగా మంత్రి కోరడంతో దిల్ రాజు తమ కుటుంబం స్థాపించిన మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలను బాగోగులను చూసుకుంటానని దిల్ రాజు తెలిపారు.

Recommended For You