కరోనా రోగులను గుర్తించే జాగిలాలు..

కరోనా రోగులను గుర్తించే జాగిలాలు..

లక్షణాలు ఉండట్లేదు అయినా పాజిటివ్ వస్తుంది. ఇలాంటి వారిని కొవిడ్ ఉందో లేదో ముందే తెలుసుకుంటే చికిత్స సులభమవుతుందని భావించారు చిలీ పోలీసులు. శరీరానికి పట్టిన చెమట ద్వారానే పాజిటివ్ వ్యక్తులను గుర్తించే విధంగా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి కొవిడ్ ఉన్న వ్యక్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్చ చేయవచ్చని భావిస్తున్నారు. బ్రిటన్ లో ఈ విధంగా చేసి మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు చిలీ దేశం కూడా అదే బాటలో పయనిస్తోంది. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జనం ఎక్కువగా తిరుగాడే ప్రదేశాలైన స్కూళ్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలలో ఈ జాగిలాలు, వాసన ద్వారా వైరస్ ఉన్న రోగులను గుర్తిస్తాయి. ఫలితంగా ప్రాధమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడే వీలుంటుందని లెప్టెనెంట్ కల్నల్ ఆక్విడో యాన్జీ పేర్కొన్నారు. చెమట ద్వారా జాగిలాలు కరోనాను గుర్తించే ట్రయల్స్ ను లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ లో చేశారు.

Tags

Read MoreRead Less
Next Story