కోవిడ్ ఎఫెక్ట్ పడిపోయిన GST ఆదాయం

జూలైలో రూ.87వేల 422 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి GST రూపంలో ఆదాయం వచ్చింది. గత నెలలో 90,917 కోట్లు రాగా… ఈ నెలలో మరింత తగ్గింది. ఏప్రిల్ నుంచి కోవిడ్ కారణంగా బిజినెస్ భారీగా తగ్గింది. దీంతో ఆదాయం కూడా పడిపోయింది. 2019 ఏప్రిల్లో లక్షా 13వేల 865 కోట్లు రాగా.. ఈ ఏడాది కేవలం 32వేల 172 కోట్లు మాత్రమే. మేలో గత ఏడాది లక్షా 289 కోట్లు వస్తే ఈ ఏడాది 62వేల కోట్లకు పడిపోయింది. జూన్ లో గత ఏడాది సుమారు లక్ష కోట్లు వచ్చింది. ఈ ఏడాది కూడా స్వల్నంగా తగ్గి 90వేల కోట్లు వచ్చింది. కానీ జులైలో మళ్లీ గ్యాప్ పెరిగింది. గత ఏడాది జులైలో లక్షా 2వేల కోట్లు ఆదాయం వస్తే.. ఈ ఏడాది 87422 కోట్లు మాత్రమే. అయితే 5 కోట్ల టర్నొవర్ లోపు ఉన్న వ్యాపార సంస్థలకు సెప్టెంబర్ వరకు రిటర్స్ ఫైల్ చేయడానికి అవకాశం ఇవ్వడంతో తగ్గినట్టు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి జిఎస్టీ పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

Recommended For You