కాంగ్రా జిల్లాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం: హిమాచల్ ప్రదేశ్ మంత్రి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కాంగ్రా జిల్లాలో త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ర్ట‌ అటవీ, యువజన సేవలు, క్రీడాశాఖ మంత్రి రాకేశ్ పఠానియా తెలిపారు. కాంగ్రా జిల్లాలోని నూర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన జులై 30న సీఎం జై రామ్ ఠాకూర్ కేబినెట్ లో చేరారు. ఇటీవలే ఆయన అటవీ, యువజన సేవలు, క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రాలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోనే క్రీడలకు ఒక అద్భుత కేంద్రంగా మార‌నుంద‌న్నారు. ఈ విష‌య‌ంపై సీఎం జై రామ్ ఠాకూర్‌తో చర్చించానని అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ప్ర‌తిభావంతులైన యువ‌త.. మత క్రీడా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు.

Recommended For You