కేంద్ర సహాయమంత్రి నిరాహార దీక్ష

కేరళ సీఎం పినరయి విజయన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి వీ మురళీధరన్ ఢిల్లీలో ఒక రోజు నిరాహాద దీక్ష చేపట్టారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నది. ఈ కేసులో నిందితురాలైన స్వప్న సురేశ్‌తో సీఎం విజయన్, ఆయన మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌కు సంబంధం ఉన్నదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో సీఎం పదవికి విజయన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు చేశాయి. కాగా.. శనివారం నుంచి 18 రోజుల పాటు నిరాహార దీక్షలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. శనివారం నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించడంతో.. బీజేపీ ఎమ్మెల్యే భూపేందర్ యాదవ్ శనివారం నిరాహార దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మద్దతుగా కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ ఆదివారం ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ నేతలు పెద్ధ ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story