బయోగ్యాస్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని బయోగ్యాస్ ప్లాంట్‌లో బాయిలర్ పేలి శనివారం 5 మంది మృతి చెందారు. ఉమ్రేడ్ తహసీల్‌లోని బేలా గ్రామంలో ఉన్న మనస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మృతులు ప్రభాకర్ నౌకర్కర్ (21), లిలాధర్ వామన్‌రావ్ షిండే (42), వాసుదేవ్ లాడి (30), సచిన్ ప్రకాష్ వాగ్మారే (24), ప్రతాప్ పాండురంగ్ మూన్ (25) గా గుర్తించారు. వీరంతా బుడ్‌గావ్‌లో నివసించేవారు. సచిన్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేసేవాడు, మిగిలిన వారు సహాయకులు అని పోలీసులు తెలిపారు.

Recommended For You