కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమతికి పంపనున్న నేపాల్

కొత్త మ్యాప్‌ను ఐక్యరాజ్యసమతికి పంపనున్న నేపాల్

సరిహద్దు ప్రాంతాల విషయంలో గత కొన్ని రోజుల నుంచి నేపాల్ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవిగా చూపిస్తూ.. కొత్త మ్యాప్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాప్ కు పార్లమెంట్ కూడా ఆమోదించింది. అయితే, తాజాగా ఈ మ్యాప్ ను ఐక్యరాజ్యసమితికి, గూగుల్ కు పంపించాలని నేపాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని నేపాల్ మంత్రి పద్మ ఆర్యాల్ స్వయంగా తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న నేపాల్ మ్యాప్ ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తామని అన్నారు. ఈ మూడు ప్రాంతాలకు సంబందించిన ఓ పుస్తకాన్ని ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించి విడుదల చేస్తామని అన్నారు. అయితే, పుస్తకం కంటే ముందు ఈ మ్యాప్ ను అంతర్జాతీయ సమాజానికి పంపించడానికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. అయితే, ఈ మూడు ప్రాంతాలు తమవిగా చూపిస్తూ.. మ్యాప్ ను విడుదల చేయాడాన్ని భారత ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్‌ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story