ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

శార్వారీ నామ సంవత్సర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై నాలుగు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ వారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. అమ్మవారికి స్తన్నపనది కార్యక్రమాల అనంతరం దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. పవిత్రోత్సవాలు సందర్భంగా 9 గంటలకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. పవిత్రాలను అర్చక స్వాములు ఆలయంలోని అన్ని విగ్రహాలకు అలంకరించనున్నారు.

Recommended For You