మెహబూబా ముప్తీని విడుదల చేయాలి: రాహుల్ గాంధీ

మెహబూబా ముప్తీని విడుదల చేయాలి: రాహుల్ గాంధీ
X

పీడీపీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంను నిర్బంధం నుంచి విడుదల చేయాలని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఆమె నిర్భంధాన్ని ప్రభుత్వం పొడిగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పటికైనా ఆమెను విడుదల చేయాలని అన్నారు. భారత ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని.. రాజకీయ నేతలను ప్రభుత్వం అక్రమంగా నిర్భంధిస్తుందని ఆయన మండిపడ్డారు. మెహబూబా ముప్తీని తక్షణమే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కూడా ఇదే డిమాండ్ చేశారు. ముప్తీ నిర్భంధాన్ని ఇలా పొడింగించుకుంటూ వెళ్లడం అంటే.. చట్టాన్ని, రాజ్యాంగాన్ని అపహేలన చేయడేమేనని అన్నారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని గత ఏడాది రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఫరూక్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీ సహా పలువురు నేతలను గృహ నిర్భందం చేశారు. అయితే, ముందు ఈ నిర్భంధాన్ని 5 నెలలు, ఇప్పుడు మరో 3 నెలులు ప్రభుత్వం పొడించింది.

Tags

Next Story