200 మంది కాదు.. 170 మంది మాత్రమే.. మరింత నిరాడంబరంగా..

కరోనా నేపథ్యంలో ఆగస్టు 5న జరగనున్న రామాలయ భూమి పూజ కార్యక్రమాన్ని అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కేవలం 200 మందికే ఆహ్వానాలు పంపించాలని రామాలయ ట్రస్ట్ బోర్డు ముందుగా బావించింది. అయితే, తాజాగా బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ సంఖ్యను మరింత తగ్గించినట్టు తెలుస్తుంది. 170 మందికి మాత్రమే ఆహ్వానాలు పంపాలని నిర్ణయించింది. ఇందులో దాదాపు యాబై మంది సాధు సంతులు ఉంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ ఆనందీబేన్ పాటిల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షులు నృత్య గోపాల్ దాస్‌, ఆరెస్సెస్ అగ్రనేతలు దత్తాత్రేయ హోసబళే, భయ్యాజీ జోషి తదితరులు హాజరుకానున్నారు.

Recommended For You