సెప్టెంబర్‌ 1 నుంచి స్కూల్, కాలేజ్‌లు రీ ఓపెన్‌!

సెప్టెంబర్‌ 1 నుంచి స్కూల్, కాలేజ్‌లు తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు అసోం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ‘సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని’ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ తెలిపారు. అయితే స్కూల్, కాలేజ్‌లు రీ ఓపెన్‌.. కేంద్ర సర్కార్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని బిశ్వా శర్మ అన్నారు. నాలుగో తరగతి వరకు విద్యార్థులకు స్కూల్ ఉండదని తెలిపారు. ఉపాధ్యాయులు సిబ్బందితో అందరు ఆగస్టు 30కి ముందు తప్పనిసరిగా కొవిడ్‌-19 పరీక్షలు చేయాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.

Recommended For You