సిద్దార్ధ్ రొమాంటిక్ సాంగ్.. గంటల్లోనే 25 లక్షల వ్యూస్

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ని అన్ని భాషల్లో ఆదరించారు బుల్లి తెర ప్రేక్షకులు. ఆ సీరియల్ లో నటించిన నటుడు శివ (సిద్దార్థ్ శుక్లా), నేహా శర్మ నటించిన మ్యూజిక్ వీడియో దిల్ కో కరార్ ఆయా విడుదలై లక్షల్లో వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. ఈ వీడియో కోసం ఆత్రంగా ఎదురు చూసిన ప్రేక్షకులు ‘దిల్ కో కరార్’ అంటూ సాగే పాటవిని మైమరచి పోతున్నారు. విడుదలైన 9 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ ని సంపాదించుకుంది. ఈ పాటను శుక్లా అభిమానుల కోసం ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ పాటపై మీ అభిప్రాయాన్ని తెలపండి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. అభిమానులు రకరకాల ఎమోజీలతో పాట బావుందని మెచ్చుకుంటూ సిద్ధార్థ్ కు పోస్టులు పెడుతున్నారు.

 

Recommended For You