రాజధాని గ్రామంలో ఆగిన మరో గుండె

మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రాజధాని గ్రామంలో మరో గుండె ఆగింది. బోరుపొలానికి చెందిన వృద్ధురాలు నేలకుదిటి సామ్రాజ్యం రాజధానికి సంబంధించిన వార్త వినగానే ఒక్కసారిగా కుప్పకూలింది. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో సామ్రాజ్యం 60 సెంట్ల భూమిని ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో ఇప్పటికే 70 మందికిపైగా రైతులు కన్నుమూశారు.

Recommended For You