వైద్యులకు వందనాలు.. నేను కోలుకున్నాను: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. 23 రోజుల చికిత్స అనంతరం ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్ అయ్యారు. దేవుని దయ, తండ్రి ఆశీర్వాదం, అభిమానులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలు.. అన్నిటీకి మించి ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల అద్భుతమైన సంరక్షణ కారణంగా నేనీరోజు ఇలా ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వెళుతున్నాను అని ట్విట్టర్ వేదికగా అమితాబ్ వెల్లడించారు. తండ్రి ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటారని కుమారుడు అభిషేక్ తెలిపారు. అభిమానుల ప్రార్థనలు ఫలించి తండ్రి కోలుకున్నారని తెలిపారు. అయతే తాను మాత్రం ఇంకా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని త్వరలో తానుకూడా డిశ్చార్జ్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Recommended For You