అమిత్ షాకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేపించుకున్నానని.. దీంతో పాజిటివ్ అని తేలిందని ట్విట్ చేశారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారంతా పరీక్షలు చేపించుకోవాలని.. సెల్ప్ ఐసోలేషన్‌లో ఉండాలని కోరారు.
బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా శనివారం అమిత్ షా ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Amit Shah (@AmitShah) August 2, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com