తమిళనాడులో కరోనా కలకలం.. ఒక్కరోజే 98మంది మృతి

తమిళనాడులో కరోనా రోజురోజు తీవ్రరూపం దాల్చుతుంది. రోజువారీ నమోదవుతున్న కేసులతో అధికారులు ఆందోలనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 5,875 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,57,613కు చేరింది. అటు, ఒక్కరోజే రికార్డు స్థాయిలో 98 మంది కరోనాతో మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4,132కి చేరింది. ఇప్పటికవరకూ 1,96,483 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా ఎక్కువగా విజృంభిస్తున్నప్పటికీ.. కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్తా ఊరట కలిగిస్తుంది.

Recommended For You