బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని బీహార్ లోని మెజార్టీ పార్టీలు కోరుతున్నాయి. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు వరదలు బీహార్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ లో జరగాల్సిన ఎన్నికల నిర్వాహణపై ఎలక్షన్ కమిషన్.. రాష్ట్రంలోని రాజకీయపార్టీల అభిప్రాయాలను కోరింది. బీహార్ లో ఏడు జాతీయ పార్టీలు, 43 ప్రాంతీయ పార్టీలు.. మొత్తం 50 పార్టీలు ఉండగా.. అధికార జేడీయూ, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు అన్ని ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి. బీజేపీ కూటమిలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి. కాగా.. బీహార్ లో వరదలు కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సుమారు 50లక్షల మంది ఈ వరదలకు ప్రభావితమయ్యారు. దీంతో ఎన్నికల కమిషన్ పార్టీల అభిప్రాయాలు కోరింది. అయితే మెజార్టీ పార్టీలు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపగా.. ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

Recommended For You