సొంత వైద్యం ప్రమాదకరం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతీ రోజుల లక్షల్లో కరోనా బారినపడుతున్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరగడంతో రోగులకు ఆస్పత్రిలో బెడ్లు కూడా దొరకడం లేదు. దీంతో చాలా మంది వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు పలు సూచనలు, హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే చాలా మంది.. కరోనా పాజిటివ్ సన్నిహితులను సంప్రదించి ముందులు వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇది చాల ప్రమాదమని అంటున్నారు. రోగి శరీరాన్ని బట్టి.. డాక్టర్లు మందులు ఇస్తారని.. అందరికీ ఒకే రకమైన మెడిసిన్ ఇవ్వడంలేదని ప్రముఖ వైరాలజిస్ట్‌ అమితాబ్‌ నందీ తెలిపారు. ఫార్మసీ సిబ్బందికి కూడా కరోనా మందులపై అవగాహన లేదని నందీ అభిప్రాయపడ్డారు. ప్రజలంతా వ్యక్తి గత శుభ్రత పాటించాలని అన్నారు. ప్రస్తుతం.. కరోనా కంటే భయమే ఎక్కువ ప్రజలును ప్రమాదానికి గురి చేస్తుందని అన్నారు.

Recommended For You