ఆదివారం పెళ్లి.. అమ్మాయి తండ్రికి కరోనా లక్షణాలు..

ఆదివారం పెళ్లి.. అమ్మాయి తండ్రికి కరోనా లక్షణాలు..

కళ్యాణం వచ్చినా , కక్కొచ్చినా ఆగదంటారు.. ఈ కరోనా వచ్చి అన్నింటినీ ఆపేస్తుంది. శుభమా అంటూ కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటే అంతలోనే దగ్గు, ఆయాసం.. కరోనానే అయి ఉంటుంది.. టెస్ట్ చేయించుకోమంటూ ఆస్పత్రికి పంపాల్సొచ్చింది వధువు తన తండ్రిని. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన పెద్ద కుమార్తె వివాహం ఈనెల 9న జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో కళ్యాణమండపం జోలికి వెళ్లకుండా ఇంటి ముందే పెళ్లి పందిరి ఏరపాటు చేసి పెళ్లి జరిపించాలనుకున్నారు. శుక్రవారం సాయింత్రం వధువు తండ్రికి జ్వరం వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. దాంతో కరోనా లక్షణాలేమోనని భావించిన ప్రైవేటు వైద్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ కి పంపారు. రిపోర్ట్ రావలసి ఉంది. కుటుంబసభ్యులు కూడా భయంతో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు కరీంనగర్ ఆస్పత్రికి పయనమయ్యారు. దీంతో అమ్మాయి పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story