శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

అయ్యప్ప భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేరళ సర్కారు. కొవిడ్ నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, అయ్యప్పదర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ లేదని నిరూపించే టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరిగా సమర్పించిన తరువాతనే అనుమతి లభిస్తుందని తెలిపారు. ఐసీఎమ్మార్ గుర్తింపు పొందిన ల్యాబ్ లలో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేరళ ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతిక దూరాన్ని తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story