రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యూరియా కావాలంటే.. బయో ఫర్టిలైజర్ కూడా కొనాలనే కండిషన్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. రసాయనికి ఎరువులు నియంత్రించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రం నియమించిన టాస్క్‌‌ఫోర్స్‌ ప్రభు‌త్వా‌నికి కీలక సూచ‌నలు చేసింది.

రైతు యూరియా కొనా‌లంటే దాంతో‌పాటే ఏదైనా జీవ ఎరువు కూడా కొనేలా నిబం‌ధన పెట్టా‌లని సూచించినట్టు కేంద్ర‌వ్య‌వ‌సా‌య‌శాఖ వర్గాలు తెలి‌పాయి. ఎరువులు చల్లకుండా నీటితో కలిపి డ్రిప్‌‌ద్వారా అందిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. దీనివలన 30నుంచి 40శాతం పోష‌కా‌లను కాపా‌డ‌వ‌చ్చని, సుమారు 50శాతం నీటిని కూడా ఆదా‌చే‌య‌వ‌చ్చని సమాచారం

Tags

Read MoreRead Less
Next Story