హోం క్వారంటైన్ లో కేరళ ముఖ్యమంత్రి..

హోం క్వారంటైన్ లో కేరళ ముఖ్యమంత్రి..

కోజికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా సోకింది. దాంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన ఆరుగురు క్యాబినెట్ మంత్రులు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గృహ నిర్బంధంలోకి వెళ్లిన మంత్రులలో ఆరోగ్య మంత్రి కె.కె.శైలాజ, స్థానిక స్వపరిపాలన మంత్రి ఎసి మొయిదీన్, రెవెన్యూ మంత్రి ఇ. చంద్రశేఖరన్, పరిశ్రమల మంత్రి ఇపి జయరాజన్ కూడా ఉన్నారు.

తిరువనంతపురంలో శనివారం జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో సహకార మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని కేరళ సిఎంఓ తెలిపారు. మలప్పురం జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ వ్యాధి సోకిన వారిలో ఉన్నారు. ప్రమాదం తరువాత కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయక చర్యలలో పాల్గొన్న వారందరినీ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి గృహ నిర్భంధంలోకి వెళ్ళాలని కోరింది. విమానాశ్రయం ఉన్న కొండోట్టి, కోవిడ్ -19 పాజిటివిటీ రేటు అధికంగా కలిగిన కంటైనర్ జోన్. కేరళ ముఖ్యమంత్రి, కేరళ గవర్నర్‌తో సహా అధికారులు చాలా మంది ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు.

గత వారం, 10 మంది శిశువులతో సహా 190 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం దుబాయ్ నుండి వస్తోంది. B737 విమానం 35 అడుగుల దిగువ లోయలో పడి ముక్కలుగా విరిగింది, పైలట్లతో సహా 18 మంది మరణించారు. కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గాయపడిన మొత్తం 92 మంది ప్రయాణికులను పూర్తిగా కోలుకున్న తరువాత ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story