SomiReddy: లోకేష్ అద్భుతమైన యువ నాయకుడు
By - Subba Reddy |23 Jan 2023 8:45 AM GMT
రాష్ట్రంలోని అరాచకాలను ఎదుర్కోవాలంటే లోకేష్ పాదయాత్ర అవసరం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఒక సాహస యాత్ర కాబోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు.
నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన లోకేష్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సోమిరెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇక యువ నాయకుడిగా లోకేష్ అద్భుతంగా రాణిస్తున్నారని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎదుర్కోవాలంటే లోకేష్ పాదయాత్ర ప్రజలకు అవసరమన్నారు. లోకేష్ జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com