అతివేగం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసింది

అతివేగం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసింది
బండెక్కితే మనసు అస్సలు మాట వినదు.. రయ్ మంటూ ముందుకు దూసుకు వెళుతుంటారు.

బండెక్కితే మనసు అస్సలు మాట వినదు.. రయ్ మంటూ ముందుకు దూసుకు వెళుతుంటారు. స్పీడ్ లిమిట్ గుర్తుకు రాదు. ప్రమాదం జరుగుతుందేమో అని ఊహించలేరు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన యువకులు అతివేగంతో ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ (వీఎస్‌పీ) ప్రాంతంలోని సెక్టార్‌ టూ వద్ద గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు స్నేహితులు ప్రయాణిస్తున్న బైక్‌ డివైడర్‌ను ఢీకొనడంతో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులను ఎ సోమేష్ (19), కె వాసు (20), కె రాజు (23)గా గుర్తించారు. వీరంతా గంగవరం ప్రాంత వాసులు, దినసరి కూలీ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. సోమేశ్‌ అతివేగంతో బైక్‌ నడుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌, వీఎస్పీ వీ శ్రీనివాసరావు తెలిపారు. స్పీడుగా వస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అనంతరం విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో సోమేశ్, వాసు అక్కడికక్కడే మృతి చెందగా, రాజును కేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజు కూడా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

అతివేగం, బాధ్యతారాహిత్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసు అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story