AP : ఏపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం

AP : ఏపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల రుణం

ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ అప్పు తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలకు గాను రూ.47 వేల కోట్ల అప్పులకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా ఈ నెల 2న ప్రభుత్వం రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలకు గాను రాష్ట్రానికి కేంద్రం రూ.47,000 కోట్ల అప్పులు తీసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 2న రూ.4వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ.3వేల కోట్లు రుణం తీసుకుంది. దీనితో 20 రోజుల్లోనే రూ.7వేల కోట్లు అప్పు తీసుకున్నట్లైంది.

ఇక తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1500 కోట్ల అప్పు తీసుకుంది. ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన ఈ–వేలం ద్వారా 7.48% వార్షిక వడ్డీ, 18 ఏళ్ల కాల పరిమితికి ఈ రుణాన్ని తీసుకుంది. ఏపీ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story