Ketan Desai: సీబీఐ కేసులో అరెస్టైన కేతన్ దేశాయ్ కు టీటీడీ బోర్డ్ సభ్యత్వం

Ketan Desai: సీబీఐ కేసులో అరెస్టైన కేతన్ దేశాయ్ కు టీటీడీ  బోర్డ్ సభ్యత్వం

స్కాములు స్కీములు వేసే వారి పట్ల వైకాపా ప్రభుత్వం మమకారం చాటుకుంటూనే ఉంది. స్వీయ స్కాములులతో భ్రష్ఠుపట్టిన ప్రభుత్వం తమను మించి చేతివాటం ప్రదర్శించిన ప్రబుద్ధులను అక్కున చేర్చుకుంటోంది. తాజాగా వివిధ స్కాముల్లో నిందితులైన ఇద్దరిని టీటీడీ బోర్డ్ సభ్యులుగా నియమించింది. ఢీల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటోన్న శరత్ చంద్రా రెడ్డితో పాటూ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అవకతవకలకు పాల్పడి సీబీఐకు చిక్కిన డాక్టర్ కేతన్ దేశాయ్ తాజాగా టీటీడీ బోర్డ్ ఛైర్మన్ లు గా నియమితులయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి నూతనంగా ఏర్పాటైన బోర్డు కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డు సభ్యులను సుధీర్ఘ చర్చోప చర్చలు అనంతరం, అర్హులైన అభ్యర్ధుల సామాజిక స్థితిగతులను బట్టీ, వారి పరపత్తిని బట్టీ ఎంపిక చేస్తుంటారు. అలాంటిది ఈసారి బోర్డు సభ్యుల జాబితాలో కళంకితులైన కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి పేర్లు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.

ఈసారి టీటీడీ బోర్డ్ సభ్యుల ఎంపికలో ప్రభుత్వం తమకు అత్యంత సన్నిహితులకే పెద్ద పీట వేసిన వైనం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డికి తండ్రే శతర్ చంద్రారెడ్డి. ఆయన అరబిందో ఫార్మా సంస్థలో నాన్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఈ కేసు ట్రైల్ దశలో ఉంది.

ఇక గజరాత్ కు చెందిన కేతన్ దేశాయ్, 2010,లో పంజాబ్ లోని ఏమాత్రం మౌళిక వసతులు లేని ఓ మెడికల్ కళాశాలకు దొడ్డి దారిలో అనుమతులు మంజూరు చేసినందుకు గానూ సీబీఐ దేశాయ్ ను అరెస్ట్ చేసింది. దీంతో పాటూ తన పదవీకాలంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే అతడిపై ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ భారత మెడికల్ అసోసియేషన్ దేశాయ్ కు తన మద్దతు తెలియజేసింది. ఏన్ని కేసులు ఉన్నా, ఒక్క దాన్లోనూ అతడిపై ఆరోపణలు నిరూపితమవ్వలేదని స్పష్టం చేసింది.


ప్రతి రెండేళ్లకూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి నూతన బోర్డుని ఏర్పాటు చేస్తుంది. పాత బోర్డ్ పదవీ కాలం పూర్తవ్వడంతో తాజాగా జాబితాను ప్రకటించింది. జగన్ కు సమీప బంధువు అయిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తితిదే ఛైర్మెన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story