AP: మరోసారి మాట తప్పిన జగన్..

AP: మరోసారి మాట తప్పిన జగన్..
అసెంబ్లీ సాక్షిగా 2023 జూలై 8 నుంచి పెన్షన్‌ 3 వేలుకు పెంచుతామని ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదు.

ఏపీ సీఎం జగన్‌ మరోసారి మాట తప్పారు.అసెంబ్లీ సాక్షిగా 2023 జూలై 8 నుంచి పెన్షన్‌ 3 వేలుకు పెంచుతామని ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదు. మాట ప్రకారం పెన్షన్లు పెంచడంలో మాట నిలబెట్టుకోని జగన్‌ సర్కారు కోట్లు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి.గతేడాది జనవరిలో పెన్షన్‌ 2500కు పెంచినప్పుడు కూడా ఐదు రోజులు సంబరాలు చేసుకున్నారు. కొత్తగా అమలు చేస్తున్నట్టు జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు.ఇలా పెన్షన్‌ మొత్తం 250 పెంచినప్పుడల్లా పత్రికలకు భారీగా ప్రకటనలు ఇస్తూ గొప్పలు చెప్పుకొంటున్నారు.

ఇక 2023 జూలై 8న దివంగత నేత రాజశేఖరరెడ్డి జయంతి రోజున పెన్షన్‌ 3 వేలకు తీసుకుపోతాం అధ్యక్షా, ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడి, నిలబడి ఉండే మనస్తత్వం మా ప్రభుత్వానిది.ఎక్కడా మోసాలు ఉండవు ఎక్కడా అబద్ధాలు ఉండవు అధ్యక్షా.అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ల పెంపుపై గతంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.అయితే జూలై 8వ తేదీ గడిచిపోయింది. వైఎస్‌ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. కానీ ఆయన చెప్పినట్టుగా పెన్షన్‌ మూడు వేలకు పెంచక పోవడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య,వితంతు,దివ్యాంగులతో పాటు పలు రకాల పెన్షన్లను ప్రతినెలా సుమారు 63 లక్షల మందికి అందుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్‌ను 2 వేలుకు పెంచారు. అయితే తమను గెలిపిస్తే పెన్షన్‌ మొత్తాన్ని 3 వేలుకు పెంచుతామని ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీ అమలు చేసుంటే పెన్షన్‌దారులు ఒక్కొక్కరు ప్రతి నెలా అదనంగా వేయి చొప్పున లబ్ధిపొందేవారు. ఈ లెక్కన ఐదేళ్లలో 60 నెలలకు ఒక్కొక్కరికి అదనంగా 60 వేలు అందేది. అయితే సీఎం అయ్యాక పెన్షన్‌ 3 వేలు ఇవ్వకుండా ఏడాదికి 250 రూపాయలు పెంచుతామని మెలిక పెట్టారు.

ఇక ముచ్చటగా మూడో సారి..సారీ చెప్పింది జగన్‌ సర్కార్‌.2019 జూలై 8న వైఎస్‌ జయంతి నాడు పెన్షన్‌ను 2 వేలు నుంచి 2 వేల250కు పెంచారు. అప్పటి నుంచైనా ఏటా రూ.250 పెంచినట్టయితే 2022 జూలై నాటికే పెన్షన్‌ 3 వేలు అవ్వాలి. అయితే ఆ మాటా తప్పి మడమ తిప్పేశారు. ప్రస్తుతం 2వేల750 మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు సంక్షేమంలో తన తండ్రి ఒక్క అడుగేస్తే, తాను మూడడుగులు వేస్తానని చెప్పుకొనే జగన్‌ తన తండ్రి జయంతి నాడు ప్రారంభించి తర్వాత అదే కార్యక్రమం నాటికి పూర్తిస్థాయిలో ఇస్తానన్న పెన్షన్‌ పథకానికి తూట్లు పొడిచారని నెట్‌జన్లు సోషల్‌ మీడియాల ట్రోల్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story