AP: జగన్‌ మళ్లీ గెలిస్తే కరెంట్‌ షాక్‌

AP: జగన్‌ మళ్లీ గెలిస్తే కరెంట్‌ షాక్‌
భయాందోళనల్లో ప్రజలు.... ఐదేళ్ల పాలనలో ప్రజలపై అదనంగా 19 వేల కోట్ల బాదుడు

జగన్‌ పాలనలో విద్యుత్‌ ఛార్జీల భారంతో సామాన్యులపై పెను భారం పడింది. ఐదేళ్లలో ఆరుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఒక్కో ఏడాదిఒక్కో కేటగిరీలో వడ్డించుకుంటూ పోయి ప్రజల నుంచి 18 వేల 817 కోట్లు అదనంగా పిండుకున్నారు. మరో 12 వేల 491 కోట్ల బాదుడుకు డిస్కంలు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఎన్నికల సంవత్సరం కావడంతో హోల్డ్‌లో పెట్టారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ఇంకో షాక్‌ తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు, పరిశ్రమలు,. ఇలా ఏ వర్గాన్నీ వదలల్లేదు. కాకపోతే అన్ని వర్గాలపై ఒకేసారి ఛార్జీల భారం వేస్తే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన జగన్‌ సర్కార్‌.....ఒక్కో ఏడాది ఒక కేటగిరీని లక్ష్యంగా చేసుకుంది. జగన్‌ గద్దెనెక్కిన నెలరోజులకే జనానికి మొదటి కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. 500 యూనిట్లకు మించి వాడే వినియోగదారులకు..యూనిట్‌కు 90 పైసలు వడ్డించారు. ఇలా ఏటా 1,300 కోట్ల చొప్పున గత నాలుగేళ్లలో జగన్‌ సర్కార్‌ 5వేల 200 కోట్లు అదనంగా పిండుకుంది.

వైసీపీ ప్రభుత్వం రెండో బాదుడుకు పెట్టిన పేరు ఫిక్స్‌డ్ ఛార్జీలు. కనీస వినియోగ ఛార్జీలకు బదులు కాంట్రాక్ట్‌ లోడ్‌పై స్థిర ఛార్జీల కింద కిలోవాట్‌కు 10 రూపాయల చొప్పున వసూలు చేసే విధానాన్ని 2021 ఏప్రిల్‌ నుంచే అమల్లోకి తెచ్చారు. 3కిలోవాట్ల కాంట్రాక్ట్‌ లోడ్‌ తీసుకున్న సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి ప్రతినెలా 30,.. త్రీఫేజ్‌ కనెక్షన్‌ వినియోగదారుల నుంచి కనీస కాంట్రాక్ట్‌ లోడ్‌ అయిదు కిలోవాట్లపై 50 చొప్పున వసూలు చేసింది. పాత విధానంలో.. సింగిల్‌ ఫేజ్‌ వినియోగదారుల నుంచి 65, త్రీఫేజ్‌ వినియోగదారుల నుంచి 150 రూపాయల వంతున కనీస డిమాండ్‌ ఛార్జీలను డిస్కంలు వసూలు చేసేవి. ఈ మొత్తం కంటే విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉన్న నెలలో...... ఆ వ్యత్యాసం మాత్రమే కనీస ఛార్జీల రూపేణా వినియోగదారులపై పడేది..! మొత్తంగా ఫిక్స్‌డ్‌ ఛార్జీల రూపంలో ఏడాదికి 600కోట్లు చొప్పున మూడేళ్లలో 1800 కోట్లు దండుకుంది.

ఇక జగన్న తీసిన మూడోరకం కొరడా పేరు ట్రూఅప్‌ ఛార్జీలు. 2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన విద్యుత్‌కు ట్రూఅప్‌ ఛార్జీల రూపేణా 2వేల 910 కోట్ల రూపాయలు పిండుకునేందుకు పచ్చజెండా ఊపారు. యూనిట్‌కు 22 పైసల వంతున 2022 ఆగస్టు నుంచి డిస్కంలు ఈ మొత్తాన్ని బిల్లులో కలిపి వసూలు చేస్తున్నాయి. 36 నెలలపాటు ఈ బాదుడు కొనసాగనుంది. ఐతే... ప్రతిపాదించిన మొత్తంలో ఇప్పటికే 14వందల 55 కోట్లు వసూలు చేసేసింది. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలుకు జగన్‌ సర్కార్‌ పెట్టుకున్న లక్ష్యం 3వేల 82 కోట్లు రూపాయలు. 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీలుగా ప్రతిపాదించిన ఈ మొత్తాన్ని 2023 ఏప్రిల్‌ నుంచి 12 వాయిదాల్లో వసూలుకు డిస్కంలకు అనుమతించింది. అవి గత ఏప్రిల్‌ నుంచి వసూలు చేస్తున్నాయ. పది నెలల్లో 2వేల 569 కోట్ల రూపాయలను ప్రజల నుంచి పిండుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story