TTD : తిరుమలలో భక్తుల రద్దీ .. దర్శనానికి 12 గంటల టైమ్

TTD : తిరుమలలో భక్తుల రద్దీ .. దర్శనానికి 12 గంటల టైమ్

తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది . మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 6 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారు తెప్పపై విహ‌రించారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు ముమ్మార్లు విహ‌రిస్తూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రప‌ర్వంగా జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story