TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... 8 గంటల్లో దర్శనం

TTD : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...   8 గంటల్లో దర్శనం

TTD : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నిన్న (మంగళవారం) 64,552 మంది స్వామివారిని దర్శించుకోగా 19,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.91 కోట్లు సమర్పించారు.

మరోవైపు తిరుమతి తిరుపతి దేవస్థానం ఇటీవల టీటీడీ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే..ఇందులో మొత్తం 78 పోస్టులున్నాయి. వీటిలో కూడా డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు- 49.. జూనియర్‌ లెక్చరర్‌-29 పోస్టులున్నాయి. అయితే.. జూనియర్‌ కాలేజీల్లోని 29 లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మార్చి 5 నుంచి ప్రారంభమైంది.

అర్హత, ఆసక్తిఉన్న విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 25వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story