Telugu News Anchor : ప్రముఖ తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ మృతి

Telugu News Anchor : ప్రముఖ తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దూరదర్శన్ లో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి జాబ్ లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.

ఇక 1977 అక్టోబర్ 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను మొదలుపెట్టగా.. అందులో మొట్టమొదటిగా తెలుగు యాంకర్ గా శాంతి స్వరూప్ పనిచేశారు. ఇప్పుడంటే న్యూస్ చదివే వారికి టెలీప్రాంప్టర్‌ ఉంది. అయితే టెలీప్రాంప్టర్‌ లేని రోజులలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా న్యూస్ చదివి అందరి మన్నలను పొందాడు శాంతి స్వరూప్.

ఇలా ఆయన 2011లో దూరదర్శన్ నుండి పదవి విరమణ పొందాడు. తన సేవలకు గాను లైప్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శాంతి స్వరూప్ మరణ వార్త తెలుసుకున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story