AP : పవన్‌కు నిజంగానే అనసూయ సపోర్ట్ చేసిందా..?

AP : పవన్‌కు నిజంగానే అనసూయ సపోర్ట్ చేసిందా..?

బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ సాధించింది అనసూయ. మరోపక్క వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పొలిటికల్ సపోర్ట్ పై చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ.. రాజకీయాల గురించి ఎదురైన ఎదురైన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. రాజకీయాల గురించి మాట్లాడడం వివాదం అవ్వచ్చు. కానీ వీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అంటూ ఈమె రాజకీయాల గురించి వివరించింది.

"నేను తప్పై ఉండవచ్చు. నాకు లీడర్స్ తోనే పని. పొలిటికల్ పార్టీతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకులు. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే నేను తప్పకుండా వెళ్తా. జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసేటప్పుడు నాకు నాగబాబుగారు, రోజా గారు ఇద్దరు కూడా చాలా క్లోజ్.. ఇటు నుంచి రోజా గారు పిలిస్తే నేను పార్టీలో భాగంగా చూడను. నాయకుల పరంగా చూసేవారికి మద్దతు తెలుపుతా అంటూ వివరించింది. నాకు చాలా పార్టీలో నుంచి చాలామంది లీడర్లు తెలుసు. వాళ్ళని అభిమానిస్తా.. వాళ్ళ ఇద్దరు పిలుపునిస్తే ఆ రెండు పార్టీలకి వెళ్తా.. అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది. అదే నా వృత్తి కాదు" అని చెప్పింది అనసూయ.

తనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీతాను ఒక సొసైటీలో ఉంది కాబట్టి.. మంచి నాయకుడు కావాలని కోరుకుంటా అని చెప్పింది. అటు జనసేన నుంచి పిలుపు వస్తే నేను కచ్చితంగా వెళ్తా అని తెలిపింది. ఇండిపెండెన్సీ, ప్రైవసీపై ఎక్కువగా వివాదాస్పద కామెంట్స్ తో హెడ్ లైన్స్ లో నిలిచే అనసూయ పవన్ కు సపోర్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. 24 గంటల్లోనే అన్ని సోషల్ మీడియాల్లో ఆమె పేరు మార్మోగిపోతోంది. ఎక్కువగా జనసైనికులు, టీడీపీ కేడర్ దీనిని ఓన్ చేసుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story