Water Problem: గుక్కెడు నీళ్ళ కొస గుడివాడ ప్రజల అవస్థలు

Water  Problem: గుక్కెడు నీళ్ళ కొస  గుడివాడ ప్రజల అవస్థలు
కుళాయిల ద్వారా వచ్చే నీరు కూడా కంపే..

కృష్ణా జిల్లాగుడివాడలో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. నీళ్లివ్వండి మహో ప్రభో అంటూ... స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నా ఫలితమే లేదంటూ చేష్టలుడిగిపోతున్నారు. గోడు పట్టించుకునేవారే వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల ఆలసత్వం కారణంగా గుడివాడ పట్టణ వాసులను దాహం కేకలు వెంటడుతున్నాయి. గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో పెద ఎరుకపాడులో 63 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు,105 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మరోక మంచినీటి చెరువును నిర్మించారు. చెరువుల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత చెరువుకు మూడేళ్ల క్రితం గండి పడితే... ఇంత వరకు దాన్ని పూడ్చలేదు. నిర్వహణ లేకపోవడంతో కొత్త చెరువు కట్ట కూడా బలహీనంగా మారింది. దీంతో ఈ చెరువులో నీటితో నింపితే ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2 చెరువులు ఆధ్వాన స్థితికి చేరడంతో అధికారులు వాటిల్లో నీటిని నింపకుండా వదిలేశారు. దీంతో చెరువుల్లో నీరు మట్టం తగ్గిపోయింది.

గుడివాడలోని పెద ఎరుకపాడు, ఇందిరా నగర్, మందపాడు కొత్త కాలనీ, గుడ్ మెన్ పేట, ధనియాల పేట, బాపుజీ నగర్, కార్మిక నగర్... సహా వివిధ కాలనీల్లో తాగునీటి సమస్య తాండవిస్తోంది. చెరువుల్లో నీరు లేకపోవడంతో ఇప్పటికే అధికారులు రోజు విడిచి రోజు మంచినీటిని వదులుతున్నారు. అది కూడా 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే విడుదల చేస్తుడటంతో... స్థానికులు గోంతు తడుపుకోవడానికి అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు విడుదల చేస్తున్న నీరు కూడా మురికిగా వస్తోందని.. స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు తాగి అనారోగ్యంబారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..మంచినీటి చెరవులు ఉన్నా కూడా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుడదని తెలుగుదేశం హయంలో అమృత్ పథకంలో భాగంగా 2018లో గుడివాడ లో ప్రతి ఇంటికి కూళాయిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం నాగవర్పాడు, గుడ్ మెన్ పేటలో రెండు ట్యాంక్ లను నిర్మాణం చేశారు. అప్పుడే పనులు దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం అమృత్ పథకాన్ని గాలికి వదిలేయడంతో... నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story