AP: జగనన్నా... తాగునీరు ఇవ్వన్నా...

AP: జగనన్నా... తాగునీరు ఇవ్వన్నా...
అల్లాడిపోతున్న కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామాలు.... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్‌ ప్రభుత్వం

ప్రజలకు తాగునీటిని అందించే బాధ్యత కాదన్ననట్లుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వేసవి రాకముందే కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామాలు అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చూట్టూ తిరిగి అలసిపోయామని బంటుమల్లి మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


బంటుమిల్లి మండలం మల్లంపూడి, చొరంపూడి గ్రామ పంచాయతీల్లో తాగునీరు సరఫరా చేయాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో మల్లంపూడి, చోరంపూడి గ్రామాలకు తాగునీరందించేలా ఏర్పాటు చేసిన పైపులైన్ల వ్యవస్థ ఆస్తవ్యస్తంగా మారింది. దీంతో నీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


30 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్లు కావటంతో ...పైపులైన్ల వద్ద గుంత తీసి తాగునీరు పట్టుకుంటున్నారు. తాగునీటి పైపు వద్ద గుంతలోకి దిగి ఒకరు నీరు పడితే మరొకరు నీటిని పైకి అందుకుని బిందెలు నింపుతున్నారు. వైసీపీ పెడన నియోజకవర్గ బాధ్యుడు ఉప్పాల రాము తమ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చి.... నేటికీ నెరవేర్చలేదని గ్రామస్తులు వాపోయారు. మల్లంపూడి, చొరంపూడి గ్రామాల మద్య వివాదాలు తలెత్తేలా అధికారులు నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యమ్నాయ మార్గంలేక పైపులైన్లలో వచ్చే మురుగునీటిని పట్టుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లంపూడి, చొరంపూడి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story