కనేకల్ మండల విద్యుత్ ఉపకేంద్రం లో మందు పార్టీ
By - Bhoopathi |5 Jun 2023 7:00 AM GMT
అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో విద్యుత్ ఉపకేంద్ర కార్యాలయంలో, మందు పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి
అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రంలో విద్యుత్ ఉపకేంద్ర కార్యాలయంలో అధికారుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది, మందు పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కార్యాలయం లో విధులు నిర్వహించాల్సిన సమయం లో లైన్ ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో మందు పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. దేవాలయం లాంటి ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తూ, పార్టీ జరుపుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ ఇన్ స్పెక్టర్ నరసింహులు ప్రోత్సహంతోనే, కాంట్రాక్టర్ దేవరాజ్ తో పాటు ప్రైవేట్ వర్కర్లు కూడా పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది. విద్యుత్ కార్యాలయంలో మద్యం దుకాణం తెరవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com