AP : ఏపీలో డ్రగ్స్ కంటైనర్‌కు భారీ భద్రత

AP : ఏపీలో డ్రగ్స్ కంటైనర్‌కు భారీ భద్రత

కనీ వినీ ఎరుగని రీతిలో ఎన్నికల టైంలో డ్రగ్స్ కంటైనర్ ను పట్టుకున్నారు పోలీసులు. ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సరుకును సొంతం చేసుకునేందుకు డ్రగ్స్ డాన్లు ఎలాంటి దాడులకు అయినా పాల్పడతారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ అధికారులు కూడా అదే భయపడుతున్నారు. విశాఖలో దొరికిన డ్రగ్స్ కంటెయినర్ భద్రతపైనే సీబీఐ అధికారులు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఆ కంటెయినర్‌ను హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరింత సేఫ్ జోన్ కు తరలించేందుకు రెడీ అవుతున్నారు.

సీబీఐ నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు బయటకు తీసింది. 6 రకాల నిషేధిత డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రై ఈస్ట్ తో కలిపి డ్రగ్స్ రవాణా చేసినట్లు గుర్తించారు. శాంపిల్స్ సేకరించాక.. డ్రగ్స్ ను మరొక కంటైనర్ లోకి మార్చిన సీబీఐ ప్రత్యేక సీల్ వేసింది. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక రానుంది. 49 నమూనాల్ని పరీకిస్తే.. కొకైన్, మెథక్వలోన్ ఉన్నట్లు నిర్దారణ అయింది. టెస్ట్- ఏలో 27 నమూనాల్లో మార్ఫిన్, ఓపియం, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు. విశాఖ డ్రగ్స్ కేసులో 55 గంటల సుదీర్ఘ ఆపరేషన్ చేపట్టారు అధికారులు.

ఏపీ అధికారులు ఎవరికీ ఈ విషయంలో ఇన్వాల్వ్ మెంట్ లేకుండా చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ఉన్నందున.. కంటెయినర్ భద్రతపై సిబిఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కంటెయినర్ కు ఆల్ వెదర్ ఫ్రూఫ్ ప్రదేశంలో ఉంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story