TDP: తెలుగుదేశంలోకి వలసల జోరు

TDP: తెలుగుదేశంలోకి వలసల జోరు
వైఎస్సార్ జిల్లా నుంచి టీడీపీలో చేరిన 80 కుటుంబాలు.... వైసీపీ పాలనకు చివరి రోజులు దగ్గరపడ్డాయన్న తెలుగుదేశం

వైఎస్సార్ జిల్లా కమలాపురం తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం C.M.R.పల్లికి 80 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. గ్రామం నుంచి భారీ బైక్ ర్యాలీతో కమలాపురానికి వచ్చిన వారు పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి . ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పుత్తా నరసింహారెడ్డి అన్నారు. అందరూ తెలుగుదేశానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.


మరోవైపు వైసీపీ పాలనకు చివరి రోజులు దగ్గర పడ్డాయని చీరాల తెలుగుదేశం ఇన్ ఛార్జ్ M.M. కొండయ్య ఎద్దేవా చేశారు. సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టడం వైసీపీ పాలన అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. చీరాల మండలం రామకృష్ణాపురంలో" బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ " కార్యక్రమంలో పాల్గొని.. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని ...దోచుకో దాచుకో అన్నట్లుగా వైసీపీ నేతలు పాలన సాగిస్తున్నారన్నారని మండిపడ్డారు..

ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎం జగన్ ధిక్కరించి వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలని చూస్తున్నారని.. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆరోపించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం రాష్ట్రస్థాయి కళాజాత కార్యక్రమాన్ని బాపట్ల N.G.O. హోంలో నిర్వహించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి నిజాయితీపరులైన పాలకులను ఎన్నుకోవాలని.. ఓటర్లను చైతన్య పరుస్తూ కళాకారుల బృందం నాటికలు, నృత్యాలు ప్రదర్శించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈసీ ఆదేశాలను గాలికి వదిలేస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story