ప్రజావేదికను కూల్చివేస్తే వాటిని కూడా కూల్చివేయాలి : పవన్ కల్యాణ్

ప్రజావేదికను కూల్చివేస్తే వాటిని కూడా కూల్చివేయాలి : పవన్ కల్యాణ్

గతంలో టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లే వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి సమయం ఇస్తామన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఏడాదిపాటు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయమన్నారు. ప్రభుత్వ పనితీరును ఎప్పకికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు‌. రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేనను స్థాపించామని తెలిపారు పవన్.

ప్రజావేదికను కూల్చివేస్తే .. కరకట్టమీద ఉన్న భవనాలన్నింటినీ కూల్చివేయాలన్నారు పవన్ కల్యాణ్. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు ఏలా అప్పగిస్తారని ప్రశ్నించారు . దీనినిపై వైసీపీ వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. జగన్‌ పాలనలో క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత .. భవిష్యత్తు వ్యూహంపై రూపకల్పన చేస్తామన్నారు.

జనసేన ముఖ్యనేతలతో కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై పవన్ చర్చించారు. సీఆర్డీఏ మానిటరింగ్ కమిటీతో పాటు పలు కమిటీలను వేస్తున్నట్లు ప్రకటించారు. యువత లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జనసేనను పటిష్టపరుస్తామని చెప్పారు పవన్.

Tags

Read MoreRead Less
Next Story