Justice For Shyam : జూ.ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి

Justice For Shyam : జూ.ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పద మృతి
#WeWantJusticeForShyamNTR

జూ. ఎన్టీఆర్ వీరాభిమాని అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై యావత్ ఎన్టీఆర్ అభిమానులు కన్నీటిసంద్రమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ నటించిన దమ్కీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు జూ. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. వేదికపైకి వెళ్తున్న ఎన్టీఆర్ ను మెరుపు వేగంతో వెనకనుంచి వచ్చి శ్యామ్ పట్టుకున్నాడు. అప్రమత్తమైన సెక్యురిటీ అతన్ని లాగేద్దామని ప్రయత్నించగా ఎన్టీఆర్ వారిని వారించి శ్యామ్ తో ఫొటో దిగాడు. తన అభిమానుల భావోద్వేగాన్ని అందుకోవడంలో ఎన్టీఆర్ ను మించినవారు లేరని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.

తాజాగా శ్యామ్ ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు. తాను నివసిస్తున్న గదిలో ఉరివేసుకుని ప్రాణాలను వదిలాడు. శ్యామ్ మరణంపై కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ వెంటనే స్పందించి దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. శ్యామ్ మరణం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. #WeWantJusticeForShyamNTR


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. సొంత ఊరు కొప్పిగుంట. చనిపోయింది మాత్రం చింతలూరు. మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు. శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయేంత పిరికివాడు కాదని అంటున్నారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్లు చెప్పారు. జేబులో గంజాయి ఉండటంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉరి వేసుకుని చనిపోయుంటే కాళ్లు నేలపై ఎలా ఆనించి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.శ్యామ్ మరణంపై తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్ స్పందించారు. న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకుగాను ట్వీట్ చేశారు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని తెలియజేశారు. పక్షపాతం లేకుండా సమగ్ర విచారణ జరగాలని కోరారు. శ్యామ్ కు న్యాయం జరిగేవరకు తాము పోరాడతామని తెలిపారు. అయితే... శ్యామ్ ఘటన ఆత్మహత్యనా, హత్యనా, అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పలు హారోల అభిమానులందరూ ఎకమై, న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో #Justiceforshyam అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story