LOKESH: జగన్ దృష్టంతా అవినీతి సొమ్ముపైనే

LOKESH: జగన్ దృష్టంతా అవినీతి సొమ్ముపైనే
తాడేపల్లి స్థానికులతో లోకేశ్ సమావేశం... అమరావతి పనులు ప్రారంభిస్తామని హామీ

రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ సమాజంలో చీలిక తెస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలో వివిధ అపార్ట్ మెంట్ల నివాసితులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన చోట నుంచే అమరావతి పనులు ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీసు శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేసేలా... చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో... అలాంటి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. జగన్ ఆస్తుల కంటే ఆయనపై కేసులే ఎక్కువని ఎద్దేవా చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని అందుకే ఏపీలో 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో NDAను గెలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. తమ పాలనలో హింసా, దౌర్జన్యాలకు తావుండదని స్పష్టంచేశారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సంపద సృష్టించి, దాన్ని మహిళలకే పంచుతామని హామీ ఇచ్చారు. వైకాపా నేతల భూదాహానికే సుబ్బారావు కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మంది ఇలా బాధలు పడుతున్నారని చెప్పారు.


కుప్పం పర్యటనలో భాగంగా తెలుగుదేశం నేత అధినేత చంద్రబాబు...బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన..బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల అజెండా అభివృద్ధి, ప్రజస్వామ్య పరిరక్షణ అని చెప్పారు. ఏపీలో NDA అధికారంలోకి వచ్చాక పెద్ద పంచాయతీలకు 2 కోట్లు, చిన్న పంచాయతీలకు కోటి రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. పేదల పింఛను డబ్బును ఇంటివద్దకే తెచ్చి ఇస్తామన్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది తమ పార్టీయేనని అన్నారు. ముస్లింలకు చెందిన వక్ఫ్‌ బోర్డు ఆస్తులు రక్షించామన్నారు. ప్రతి నియోజకవర్గానికీ ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్త ఎన్నికల పర్యటనకు ముందు కుప్పం ప్రజల ఆశీస్సులు కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కుప్పంలో శీతల గిడ్డంగులు నిర్మిస్తామని కుప్పంలో పండిన కూరగాయలను విదేశాలకు పంపిస్తామన్నారు. భూ రికార్డులు మార్చేసి.... వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, వ్యవస్థల నిర్వీర్యం ఉండదని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పేదరికంలేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు. ద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం..... వెలుగు చూసింది. చంద్రబాబు బస చేసే వాహనాన్ని జనాలు చుట్టుముట్టగా.... అదుపు చేయటానికి పోలీసులు లేకపోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story