గ్రామ సచివాలయ పరీక్షలో గందరగోళం.. OMR షీట్‌ బాక్స్‌ల తారుమారు

గ్రామ సచివాలయ పరీక్షలో గందరగోళం.. OMR షీట్‌ బాక్స్‌ల తారుమారు

ఏపీలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష కొన్ని చోట్ల గందరగోళానికి దారితీసింది. గుంటూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. బాపట్లలో ఒక చోట సెంటర్ ఏర్పాటు చేయగా, మరో చోట పరీక్షలు నిర్వహించారు. దీంతో అభ్యర్థులు టెన్షన్‌కు గురై అవస్థపడాల్సి వచ్చింది.

అలాగే కర్నూల్‌లో OMR షీట్‌ బాక్సులు తారుమారయ్యాయి. పత్తికొండకు వెళ్లాల్సిన OMR బాక్సులు వేంపెంటకు వెళ్లాయి. ఈ పొరపాటు వల్ల పత్తికొండ ZP హై స్కూల్‌ సెంటర్‌లో పరీక్ష ఆలస్యంగా మొదలైంది. పొరపాటును గుర్తించిన అధికారులు బఫర్‌ OMR షీట్లను పంపిణీ చేసి పరీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో రెండున్నర గంటలు లేట్‌గా ఎగ్జామ్‌ రాశారు అభ్యర్థులు.

తప్పుల తడకగా గ్రామ సచివాలయ నియామకాల పరీక్ష హాల్‌ టికెట్ల జారీ అభ్యర్థుల పాలిట శాపంగా మారింది.ఇతర వివరాలన్నీ సక్రమంగా ఉన్నా... అభ్యర్ధి పేరు తప్పు రావడంతో విశాఖలో పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది మహేశ్వరి అనే విద్యార్థిని. మహేశ్వరి ఫొటో గల అభ్యర్థి హాల్‌ టికెట్‌పై బుడ్డిగ శశాంక్‌ అనే అభ్యర్థి పేరు ముద్రించడంతో అందరూ అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. అటు ఫిర్యాదు చేద్దామన్నా టోల్‌ఫ్రీ మూగబోయింది. ఇదేమని అడిగితే తమకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు GVMC అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story