AP : ఎమ్మెల్యే అయినా కూడా పవన్ సినిమాలతోనే బిజీ..!
జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న మూవీ అడ్వాన్సులు ఆయన్ను ఇప్పట్లో సినిమాలకు దూరం చేసేలా లేవు. ఎన్నికల్లో గెలిచినా.. ఎమ్మెల్యే అయినా కూడా ఆయన పలు ముందస్తు కమిట్ మెంట్ల ప్రకారం షూటింగ్ లకు వెళ్లాల్సిందే.
పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. అప్పుల్లో చూపించిన అడ్వాన్సులు అన్నీ.. వివిధ సినీ నిర్మాణ సంస్థలు, వాటి నిర్మాతల దగ్గర నుంచి పర్సనల్ లోన్ రూపంలో తీసుకున్నవే. ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్నారు. పవన్ తీసుకున్న అడ్వాన్సుల ప్రకారం చూస్తే మరో రెండేళ్ల పాటు ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అయినా.. కూటమి ప్రభుత్వంలో మంత్రి అయినా కూడా.. కమిట్ మెంట్లు పూర్తయ్యేవరకు అడ్వాన్సుల ప్రకారం నటించాల్సిందే. సో.. పవన్ మూవీ లవర్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఈ కమిట్ మెంట్లు పూర్తయితే మాత్రం షూటింగ్ లకు పవన్ గ్యాప్ ఇచ్చే చాన్సుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com