ఢిల్లీకి జనసేనాని.. ఎందుకంటే..

ఢిల్లీకి జనసేనాని.. ఎందుకంటే..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ (Delhi) పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో (TDP) పొత్తుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేనతో చేతులు కలిపి బీజేపీని (BJP) ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనసేన, టీడీపీతో పొత్తుపై అంగీకారం కుదుర్చుకునేందుకు పవన్ కల్యాణ్ పర్యటన కోసం ఈ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అధికార వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల బరిలోకి దిగింది. పొత్తు నిర్ణయాలు తేలకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిలేదు. రానున్న రోజుల్లో పొత్తుకు ఇది ఇబ్బందికరంగా మారుతుందని తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ భేటీలోనే సీట్ల సర్దుబాటుపై ప్రకటన వెలువడి, మహాకూటమిలోకి బీజేపీ చేరికపై స్పష్టత రానుంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతలు బీజేపీ అగ్రనేతలతో సమావేశమై సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని జనసేన, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పొత్తు చర్చలు పూర్తికాకముందే రెండు స్థానాల్లో అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట, అరకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తనపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థులను ప్రకటించాలన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పొత్తుపై స్పష్టత ఇవ్వకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడమే కాకుండా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను రెండు చోట్ల ప్రకటించారు. రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొత్తు, సీట్ల పంపకం ప్రక్రియ త్వరగా పూర్తి చేయకుంటే ఈ తరహా సమస్యలు వస్తాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ తరహా చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా పొత్తు, సీట్ల విషయంలో ఒక స్పష్టత రావాలని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story