AP: వైసీపీ ప్రభుత్వ కుట్రలో అల్లాడుతున్న వృద్ధులు, దివ్యాంగులు

AP: వైసీపీ ప్రభుత్వ కుట్రలో అల్లాడుతున్న వృద్ధులు, దివ్యాంగులు
నిప్పులు కక్కే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద బారులు... స్పందించని ప్రభుత్వంపై ఆగ్రహం

పింఛన్ డబ్బులు ఇంటి వద్దకు తెచ్చి ఇవ్వకుండా... వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్రలో రెండోరోజూ... నిప్పులు కక్కే ఎండలో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్ద..... వృద్ధులు, దివ్యాంగులు విలవిల్లాడుతున్నారు. విజయవాడ, NTR జిల్లా నందిగామలో........ ఓవైపు భానుడు భగభగ మండుతుంటే.. మరోవైపు పెన్షన్ కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో SBI, సేవా కేంద్రాలవద్ద బారులు తీరారు. పార్వతీపురం మన్యం జిల్లా.. సాలూరులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వృద్ధులు నానా తిప్పలు పడి బ్యాంకుల వద్ద క్యూకట్టారు. గంటలకొద్ది క్యూలో నిలబడిన తర్వాత ఈ-KYC కాలేదంటూ కొందరిని,పెన్షన్ సొమ్ము జమకాలేదని మరికొందరిని వెనక్కు పంపుతున్నారు. మరికొందరికి వేలిముద్రలు పడకపోవటంతోవృద్ధులు నీరసించిపోతున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం, కాట్రేనుకోన పరిధిలోని లంక గ్రామాల్లో వృద్దులకు అవస్థలు తప్పడంలేదు. ఐ.పోలవరం మండలం పరిధిలోని... బైరపాలెం తీర్ధాలమొండి, గోగుల్లంక, భైరవ లంకకు చెందిన లబ్ధిదారులు 20కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంకువద్దకు వచ్చారు. కాట్రేనికోన పరిధిలోని బలుసుతిప్ప, మగసానితిప్పకు చెందిన లబ్ధిదారులు..... పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని...... పడిగాపులు కాచారు. YSRజిల్లా బద్వేలు సురేంద్రనగర్ లో ఎల్లమ్మఅనే వృద్ధురాలు పెన్షన్ తీసుకునేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యారు. ఆమెకు చికిత్స చేస్తుండగానే చనిపోయారు.


46 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత ఠారెత్తిస్తుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో గొంతు తడారిపోతూ వేదన చెందారు. బ్యాంకుల్లో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక...గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో ఉంచారు. ఇలా ఒకటి, రెండు కాదు.... రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని అష్టకష్టాలు పెట్టి వికృత ఆనందం పొందారు. 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తేలికైన మార్గం ఉన్నా కాలదన్నారు. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించినా రెండు రోజుల్లోనే 90 శాతంపైగా పంపిణీ పూర్తవడంతో ఈ సారి సచివాలయాలకు, బ్యాంకులకు పదే పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలగకపోతాయా? దాన్ని టీడీపీ, మిత్రపక్షాలపై వేయకపోతామా? అని గోతికాడ నక్కల్లా ఎదురుచూసేలా గురువారం ఉదయం నుంచే వైసీపీ సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు. కుటిల రాజకీయ క్రీడను నడిపించారు. పేటీఎం బ్యాచ్‌ను పెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని కొన్ని చోట్ల పింఛనుదారులే తిప్పికొట్టారు. ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా... పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని ఎదురుతిరిగారు. గత నెల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించకుండా బ్యాంకుల వద్దకు రప్పించడమేంటని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story