TDP: అధికారంలోకి రాగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు

TDP: అధికారంలోకి రాగానే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు
కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్న నారా లోకేశ్‌.... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు...

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభయమిచ్చారు. B.C. రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం కల్పించిన E.W.S కోటా నుంచి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు . యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరించారు. పాదయాత్రలో కుటుంబ సభ్యులతోపాటు పెద్దఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్‌ కాపులకు 5శాతం కేటాయించనున్నట్లు నారా లోకేశ్ చెప్పారు. BCలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కులాల మధ్య అగ్గిరాజేసి ముఖ్యమంత్రి రాజకీయ లబ్ధిపొందుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. తునిలో కాపులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేశ్‌ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.


కాపులకు ఏడాదికి 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్.. కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని లోకేశ్ విమర్శించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. దీనికి గుర్తుగా కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేష్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి మైలురాయి వద్ద ఓ హామీ ఇస్తున్న లోకేష్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదల ఆకలి తీర్చేలా తేటగుంట పంచాయతీలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ వెంట ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ , బావమరిది మోక్షజ్ఞ యాత్రలో పాల్గొన్నారు.


టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించింది. సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. తుని నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో ఈ మ‌జిలీకి గుర్తుగా పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కాన్ని లోకేష్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. తుని నియోజకవర్గం తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌తో కలిసి కుటుంబసభ్యులు నారా బ్రహ్మణి, దేవాన్ష్, మోక్షజ్ఞ, భరత్ పాదయాత్ర చేస్తున్నారు. చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆనందంతో యువగళం బృందాలు కేరింతలు కొడుతున్నారు. వేలాది కార్యకర్తలు, అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story