AP: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు

AP: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఏపీ పోలీసులు
ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ కానిస్టేబుళ్లు అరెస్టు... జగన్‌ సర్కార్‌ సమాధానం చెప్పాలన్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయి అమ్ముతూ తెలంగాణ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటాక పో మారుతి ఈకో వాహనంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో బాలానగర్ S.O.T. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 22 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులిద్దరూ ఏపీ పోలీసులే అని తెలుసుకొని తెలంగాణ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితులు ఏపీఎస్పీకి చెందిన హెడ్‌కానిస్టేబుల్ సాగర్‌ పట్నాయక్‌, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గా గుర్తించారు. వీరిద్దరూ కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


నిందితులద్దరూ ఏపీలోని నర్సీపట్నం నుంచి తెలంగాణలోని బాచుపల్లి పారిశ్రామికవాడకు గంజాయిని తరలించి.... అమ్మకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. నర్సీపట్నంలో కిలో 12 వేల రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి బాచుపల్లిలో 15వేల చొప్పున విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ సెలవుపెట్టి మరీ ఈ అక్రమ గంజాయి దందాకు పాల్పడ్డారు. గంజాయిని అరికట్టాల్సిన పోలీసులే.. పక్క రాష్ట్రాలకు తరలించి మరీ అమ్మకాలు చేయడం ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

గత ఐదేళ్లుగా అభివృద్ధిలో కన్నా డ్రగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రాచుర్యం పొందటం దురదృష్టకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గంజాయి తరలిస్తూ... కాకినాడ పోలీసులు హైదరాబాద్‌లో పట్టుబడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనపై తలెత్తే అన్ని అనుమానాలను పరిష్కరించాలని సూచించారు. ఈ రాకెట్ వెనుక సూత్రధారి ఎవరు, పాల్గొన్న నాయకులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్‌ పాలనలో కొందరు పోలీసులు గంజాయి స్మగ్లర్లుగా, మరికొందరు కిడ్నాపర్లుగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అరాచ‌కం రాజ్యమేలుతోందని... క్రిమిన‌ల్, ఆర్థిక నేరాల్లో జగన్‌ ఆరితేరారని తప్పుబట్టారు. పోలీసులను జగన్ ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారని... ఆయన వైఖరితోనే వారికి నేరాలు అలవాటయ్యాయని లోకేష్‌ పేర్కొన్నారు.

మరోవైపు నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ..అభివృద్ధిలో కంటే మాదకద్రవ్యాల్లోనే ప్రాచుర్యం పొందటం దురదృష్టకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయితో కాకినాడకు చెందిన ఇద్దరు పోలీసులు హైదరాబాద్ లో పట్టుబడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ఘటనపై..తక్షణమే వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ గంజాయి రవాణా వెనుక సూత్రధారులు, పాల్గొన్న నాయకులెవరో తేల్చాలని.. డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story