Bajaj Pulsar : బజాజ్ పల్సర్ కొత్త మోడల్ వచ్చేసింది

Bajaj Pulsar : బజాజ్ పల్సర్ కొత్త మోడల్ వచ్చేసింది

మార్కెట్లోకి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ మోడల్ విడుదలైంది. సంస్థ దీని మోడల్ ను రిలీజ్ చేసింది. ప్రముఖ టూవీలర్, త్రీవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పల్సర్ శ్రేణికి చెందిన కొత్త బైక్ 'పల్చ ర్ ఎన్ఎఎస్ 400 మార్కెట్లోకి విడుదల చేయడంతో ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయింది.

కొత్త ఎల్లో హెడ్ ల్యాండ్, డిజిటల్ ఇన్స్ట్రు మెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ టూవీలర్ ను అప్ గ్రేడ్ చేశారు. ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తోంది.

ఈ కొత్త మోడల్ ఎన్ఎస్ డిఎన్ఎ నుంచి ప్రేరణ పొందిన డైనమిక్ రూపాన్ని కల్గి వుందని.., మరింత శక్తివంతమైన 373 సిసి ఇంజిన్ ను కల్గివుందని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. స్పీడ్ గేర్ బాక్స్, 40 పిఎ స్ పవర్, 35 ఎన్ఎం టార్క్, వైర్ ఎలక్ట్రానిక్ థ్రెటిల్, నాలుగు రైడ్ మోడ్లతో 373 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లో పనిచేస్తుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story