తాను నిజంగా తప్పు చేశానని ప్రజలు భావిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తనను రాజకీయంగా భూస్థాపితం చేయడానికి 13 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుండి విడుదల అయిన ఆయన.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కావాలనే సెక్షన్ 30 పెట్టి పోలీసులు ఉద్యోగ ధర్మాన్ని తప్పుతున్నారని విమర్శించారు. పోలీసుల సహాయంతో […]

చిత్తూరులో జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో మిస్టరీని వీడింది.ఈ కేసులో నిందితుడైన లారీ డ్రైవర్ రఫీని ఛత్తీస్‌గడ్‌లోఅరెస్ట్ చేశారు పోలీసులు. మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. చిన్నారి వర్షితకు చాక్లెట్ ఆశ చూపించి రఫీ తన వెంట తీసుకెళ్లాడని, అత్యాచారం చేసి ఆపై హతమార్చినట్లు తెలిపారు ఎస్పీ సెంథిల్‌ కుమార్. సీసీటీవీ ఫుటేజీ, ఊహాచిత్రాల సాయంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. రఫీ స్వస్థలం మదనపల్లె మండలం బసినికొండ. బాల […]

టీడీపీ నేతలకు మరోసారి కౌంటర్‌ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని వంశీ ప్రకటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే.. లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన ప్రశ్నిచంఆరు. మీరంతా రాజీనామా చేయండి.. అప్పుడు తనను ప్రశ్నించాలని అన్నారు. రాజేంద్రప్రసాద్‌ తనపై విమర్శలు చేయడంతో.. కాస్త కంట్రోల్‌ తప్పి మాట్లాడానని వంశీ ఒప్పుకున్నారు. గతంలో తనపై విమర్శలు చేసిన […]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం అకస్మాత్తుగా విజయవాడ నుంచి హస్తిన వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాని కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రులతో భేటీ అవుతారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై చర్చిస్తారంటున్నారు. అయితే ఆయన హస్తిన పర్యటనపై ఇప్పటికీ క్లారీటీ లేదు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చామని ఆ పార్టీ నేత నాదెండ్ల చెప్తున్నా.. కేంద్రప్రభుత్వ, బీజేపీ […]

ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. అయ్యప్పమాల వేసుకుని వంశీ వ్యక్తిగత దూషణలకు దిగడం దారుణమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. టీడీపీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన వ్యక్తులు.. ఇప్పుడు ఆ పార్టీ అధినేతనే […]

  టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవన్నారు. సభా నాయకుడిగా సీఎం కూడా ఇదే చెప్పారని.. దానికే తాను కట్టుబడి ఉన్నానన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

ఇసుకలో అవినీతి చేస్తున్నానంటూ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి చేసినట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. దమ్ముంటే అవినీతిని నిరూపించాలని సవాల్‌ చేశారు. అవినీతికి తావు లేకుండా సీఎం జగన్‌ నూతన ఇసుక విధానం రూపొందించారని అన్నారు ధర్మాన కృష్ణదాసు.

ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఇలాంటి అధికారులను సీఎం జగన్‌ కట్టడి చేయాలంటూ సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తాడిపత్రిలో గాయత్రీ మాతా దేవాలయాన్ని తొలగించేందుకు నోటీసులు జారీ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన బీజేపీ బూత్‌ లెవెల్‌ కార్యకర్తల మీటింగ్‌లో వీరు పాల్గొన్నారు.

ఏపీ సీఎం జగన్‌ తీరుపై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. జగన్‌ రెండు కాళ్లకు ఇసుక బస్తాలు కట్టి ఉన్న కార్టూన్‌ను ట్వీట్ కు ఎటాచ్ చేశారు.. ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉంది అంటూ.. ట్వీట్‌ కింద కామెంట్‌ చేశారు. మొత్తం 175 […]

వైసీపీ నేతల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు సైకోయిజం పీక్స్‌కు చేరిందంటూ ట్విట్టర్‌లో విమర్శించారు. ఆఖరికి ఒంటరి మహిళని సైతం వైసీపీ నేతలు వదలడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకి అడ్డంగా గోడలు కట్టారని.. ఇప్పుడు ఏకంగా మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారంటూ విమర్శించారు. ప్రకాశం జిల్లా, తిమ్మారెడ్డి పాలెంలో ఆదిలక్ష్మమ్మ ఇంటి ముందు కట్టిన గోడను […]